sukhvinder sukhu: వైల్డ్ చికెన్ వివాదంలో సుఖ్విందర్ సింగ్
1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జాతుల జాబితాలో వైల్డ్ చికెన్ కూడా ఉంది.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (sukhvinder sukhu)మరో వివాదంలో చిక్కుకున్నారు. వైల్డ్ చికెన్ (wild chiken) అంశం ఆయనను ఇబ్బంది పెడుతోంది. సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు పాల్గొన్నారు. అతిథులకు వడ్డించిన మెనూలో వైల్డ్ చికెన్ కూడా ఉంది. అయితే దాన్ని సీఎం తినలేదు. ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర అతిథులకు దీన్ని వడ్డించారు. ఈ వీడియోను జంతు సంరక్షణ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జాతుల జాబితాలో వైల్డ్ చికెన్ కూడా ఉంది. వీటిని వేటాడడం శిక్షార్హం. సీఎం క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్థానికులు నాకు భోజనం పెట్టారు. అందులో వైల్డ్ చికెన్ ఇచ్చారు. కానీ, దాన్ని తాను తినలేదని సీఎం వివరణ ఇచ్చారు. అయితే కొన్ని మీడియా చానెల్స్ తాను ఆ చికెన్ తిన్నట్టు ప్రసారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో సమోసాల అంశంలో ఇలానే వివాదంగా మారింది. ముఖ్యమంత్రి కోసం తెచ్చిన సమోసాలను ఆయన భద్రతా సిబ్బంది తిన్నారని దీనిపై విచారణకు ఆదేశించారని ప్రచారం సాగింది. అయితే అలాంటిదేమీ లేదని పోలీస్ శాఖ ప్రకటించింది. సమోసాల అంశంపై మీడియాలో కథనాలు రావడంతో బీజేపీ నాయకులు సమోసాలు తింటూ సెటైర్లు వేశారు.