జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Jamili Elections: వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation, One Election) బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.

Update: 2024-12-12 09:36 GMT

జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Jamili Elections: వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation, One Election) బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్(Parliament) సమావేశాల్లోనే ఈ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. జమిలి ఎన్నికలకు సంబంధించి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind )కమిటీ సిఫారసు చేసింది.

తొలి దశలో లోక్ సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది కోవింద్ కమిటీ. రెండో దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేశారు. జమిలి ఎన్నికలకు రాజ్యాంగానికి18 సవరణలు సూచించింది కోవింద్ కమిటీ.

2023 సెప్టెంబర్ 2న జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. రాజకీయ పార్టీలతో పాటు పలువురి నుంచి ఈ కమిటీ అభిప్రాయాలను సేకరించింది. ఈ ఏడాది మార్చి 14న కోవింద్ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఎన్ డీ ఏ పక్షాలు జమిలి ఎన్నికలకు సానుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి.

Tags:    

Similar News