UPSC Civils Main Results: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్ పరీక్షల ఫలితాలు రిలీజ్..డైరెక్ట్ లింక్ ఇదే

Update: 2024-12-09 15:01 GMT

UPSC Mains Result 2024: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2024 ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు ఈ డైరెక్ట్ లింక్ సహాయంతో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2024 ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2024కి హాజరైన అభ్యర్థులందరూ UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్ష 20, 21, 22, 28, 29 సెప్టెంబర్ 2024 తేదీలలో జరిగింది. రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించగా, మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించారు.

ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ పర్సనాలిటీ/ఇంటర్వ్యూ రౌండ్‌లో హాజరు కావడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో అప్‌లోడ్ చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కి అర్హులైన అభ్యర్థులందరూ ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందు వారి వివరణాత్మక దరఖాస్తు ఫారమ్-II (DAF-II)ని పూరించాలి.

ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీకష నిర్వహించి జులై 1న ఫలితాలను విడుదల చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో మెయిన్ నిర్వహించారు. తాజాగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. త్వరలో నిర్వహించే ఇంటర్వ్యూలో సత్తా చాటిన వారిని ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ ఇతర కేంద్ర సర్వీసులకు సెలక్ట్ చేస్తారు. 

Tags:    

Similar News