Top 6 News @ 6PM: పవన్ కళ్యాణ్ కు బెదిరింపులు: మరో 5 ముఖ్యాంశాలు

పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆయనను చంపేస్తామని ఆగంతకుడు బెదిరిస్తూ ఫోన్ చేశారు.

Update: 2024-12-09 12:50 GMT

Top 6 News @ 6PM: పవన్ కళ్యాణ్ కు బెదిరింపులు: మరో 5 ముఖ్యాంశాలు

1. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ

తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహన్ని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహన్ని రూపొందించిన ప్రొఫెసర్ యాదగిరి, ఎంవీ రమణారెడ్డిలే ఈ విగ్రహన్ని కూడ తయారు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి భావన మాత్రమే కాదు.. 4 కోట్ల బిడ్డల భావోద్వేగమని ఆయన చెప్పారు.

2. ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్ధిగా ఆర్. కృష్ణయ్య

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆర్. కృష్ణయ్యను బీజేపీ ఎంపిక చేసింది. ఇటీవలనే రాజ్యసభ పదవికి కృష్ణయ్య రాజీనామా చేశారు. అప్పట్లో ఆయన వైఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాల పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదలైంది. రేపే నామినేషన్ల దాఖలుకు చివరి తేది. ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మూడు స్థానాలు దక్కనున్నాయి. బీజేపీ నాయకులు కొంతకాలంగా కృష్ణయ్యతో టచ్ లో ఉన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్ .కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా బీజేపీ సంకేతాలు ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో టీడీపీ నుంచి బీదమస్తాన్ రావు, సానా సతీష్ లు రాజ్యసభ అభ్యర్థులుగా డిసెంబర్ 10న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

3. డ్యాన్స్ యూనియన్ నుంచి నన్ను తొలగించలేదు: జానీ మాస్టర్

తనను డ్యాన్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. తన పదవీకాలం ముగియకుండానే స్వంత నిర్ణయాలు తీసుకొన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకంటామని ఆయన హెచ్చరించారు.తన పదవీకాలం ఇంకా ఉందని చెప్పారు. అనైతికంగా ఎన్నికలు నిర్ణయించి, ఎవరికి వారే నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన చెప్పారు.

4. పవన్ కళ్యాణ్ కు బెదిరింపులు

పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆయనను చంపేస్తామని ఆగంతకుడు బెదిరిస్తూ ఫోన్ చేశారు. పవన్ ను ఉద్దేశించి అభ్యంతకర భాషను ఉపయో్గించారని ఆయన పేషీ సిబ్బంది చెప్పారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు సిబ్బంది. బెదిరింపు ఫోన్ కాల్స్ విషయాన్ని డిప్యూటీ సీఎం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

5. పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రవేశపెట్టనుంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ నేతృత్వంలోని కమిటీ న నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ కమిటీకి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల బిల్లును కూడా కేంద్రం సిద్దం చేసినట్టుగా బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

6. ఆర్ బీ ఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంతదాస్ పదవీకాలం డిసెంబర్ 10తో ముగియనుంది.దీంతో ఆయన మల్హోత్రాను నియమించారు. 2018లో దాస్ ఆర్ బీ ఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 2021లో ఆయన పదవీకాలం ముగిసింది. మూడేళ్ల పాటు ఆయన పదవీని కేంద్రం పొడిగించింది. ఈ నెల 26న ఆర్ బీ ఐ గవర్నర్ గా మల్హోత్రా బాధ్యతలు చేపడారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

1990 ఐఎఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా. ఐఐటీ కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐటీ, మైన్స్ తదితర రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా ఆయన సర్వీసు అందించారు. ప్రస్తుతం ఆయన రెవిన్యూశాఖ కార్యదర్శిగా ఉన్నారు.

Tags:    

Similar News