ఎన్‌సిబి కార్యాలయానికి చేరుకున్న రియా చక్రవర్తి.. అరెస్ట్ చేస్తారా?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ కోణాన్ని పరిశీలిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) బృందం..

Update: 2020-09-07 05:10 GMT

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ కోణాన్ని పరిశీలిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) బృందం రియా చక్రవర్తిని వరుసగా రెండవ రోజు విచారిస్తోంది. విచారణలో భాగంగా ఎన్‌సిబి కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారంలో రియా పాల్గొనే అవకాశంపై ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రియా సోదరుడు షోవిక్, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా , సహాయకుడు దీపేశ్ సావంత్ లను అధికారులు ప్రశ్నించారు.

వర్గాల సమాచారం ప్రకారం, రియాను కూడా ఈ రోజు అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతకుముందు ఆదివారం రియాను 6 గంటలు విచారించారు. నిన్నటి విచారణకు రియా ఆలస్యంగా రావడం వల్ల, ప్రశ్నలు , సమాధానాలు పూర్తి కాలేదు, దాంతో ఈ రోజు ఆమెను మళ్ళీ పిలిచారు. రియా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్‌సిబి కార్యాలయానికి చేరుకుంది. ఇదిలావుంటే..

డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 6 మందిని అరెస్టు చేశారు..

1. కైజాన్ ఇబ్రహీం

2. అబ్దుల్ బాసిత్

3. జైద్ విలాత్రా

4. షోవిక్ చక్రవర్తి (రియా సోదరుడు)

5. శామ్యూల్ మిరాండా

6. అబ్బాస్ లఖాని

డ్రగ్స్ కేసులో ఈ నలుగురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి..

1. రియా చక్రవర్తి

2. జయ షాహా

3. శ్రుతి మోడీ

4. గౌరవ్ ఆర్య 

Tags:    

Similar News