sushant singh rajput : ఆరోపణలు రుజువైతే రియాకు పదేళ్ల జైలు!
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో అతని స్నేహితురాలు, నటి రియా చక్రవర్తిని..
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో అతని స్నేహితురాలు, నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో ప్రస్తుతం ఆమె ఉన్నారు, ఇక్కడ ఇప్పటికే షీనా బోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ, కొరెగావ్-భీమా కేసులో అరెస్టయిన కార్యకర్త సుధా భరద్వాజ్ కూడా ఉన్నారు. రియా చక్రవర్తిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం 1985 లోని సెక్షన్ 8 (సి), 20 (బి) (ii) ప్రకారం.. 22, 27 ఎ, 28, 29 కింద ఎన్‌సిబి అభియోగాలు మోపింది. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని బోర్డు తెలిపింది. ఆరోపణలు రుజువైతే, రియా కనీసం పదేళ్లపాటు జైలుకు వెళ్ళవలసి ఉంటుంది.
సెక్షన్ 20 (బి) (ii) ప్రకారం.. నిషేధిత డ్రగ్స్ ను ఎవరైనా తక్కువ పరిమాణంలో తయారు చేయడం, కలిగి ఉండటం, అమ్మడం, కొనడం లేదా ఉపయోగించడం వంటివి చేస్తే, వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా పదివేల రూపాయల జరిమానా విధించవచ్చు. వాణిజ్య పరిమాణం కంటే కొంచెం ఎక్కువగా ఉంటే, అప్పుడు శిక్ష పదేళ్ల వరకు ఉంటుంది. అలాగే జరిమానా లక్ష రూపాయల వరకు ఉంటుంది. కాగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్ సహాయంతో డ్రగ్స్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణలో రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉందని, ఆమె సిండికేట్ సభ్యురాలుగా ఉన్నట్లు వెల్లడైంది.