ఉత్తరాఖండ్ జోషిమఠ్‌లో కొనసాగుతోన్న సహాయచర్యలు

* వరదలో కొట్టుకుపోయిన వారి ఆచూకీ కోసం.. * గాలింపు చర్యలు ముమ్మరం చేసిన అధికారులు * ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యం

Update: 2021-02-13 10:45 GMT

ఫైల్ ఇమేజ్ 

ఉత్తరాఖండ్‌లో వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. చమోలి జిల్లా జోషిమఠ్‌లో పవర్ ప్లాంట్ సొరంగంలోని వారిని బయటకు తీసేందుకు ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్‌ఎప్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఆరు రోజులుగా సొరంగం దగ్గర సహాయచర్యలు చేపడుతున్నా ఇప్పటివరకు ఆచూకీ తెలియకపోవడంతో కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

వరద విలయంలో 190 మందికి పైగా గల్లంతవగా ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 160 మంది ఆచూకీ తెలియరాలేదు. ఇందులో 30 మంది తపోవన్ దగ్గర్లోని పవర్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో చిక్కుకుని ఉంటారని భావిస్తోన్న రెస్క్యూ సిబ్బంది సొరంగంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వరద ప్రభావంతో కొట్టుకొచ్చిన బురద గట్టిపడటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Tags:    

Similar News