Remote voting: త్వరలో రిమోట్ ఓటింగ్: సిఈసి
Remote voting:'రిమోట్ ఓటింగ్' సదుపాయం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎస్ఈసీ కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు.
Remote voting: ఎన్నికలు జరిగే రోజునే ఎక్కడి నుండైనా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ 'రిమోట్ ఓటింగ్' సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. బహుశా ఈ విధానం 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అందుబాటులోకి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రిమోట్ ఓటింగ్ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే రెండు మూడు నెలల్లో ప్రారంభం కానుందని పేర్కొన్నారు.
'ఐఐటీ మద్రాస్, ఇతర ఐఐటీలకు చెందిన నిపుణులు, టెక్నోక్రాట్స్ రిమోట్ ఓటింగ్ లేదా బ్లాక్‌చైన్ ఓటింగ్ విధానంపై తీవ్రంగా కృషిచేస్తున్నారు.. తొలి పైలట్ ప్రాజెక్ట్ రాబోయే రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతుందనే ఆశాభావంతో ఉన్నాం' అని సంసద్ రత్న అవార్డుల బహుకరణ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ అరోరా అన్నారు. వచ్చె నెలలో సీఈసీ సునీల్ ఆరోరా పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే.
అధార్‌తో ఓటును అనుసంధానం చేయాలన్న ఈసీ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఇటీవల కేంద్ర న్యాయశాఖ చేసిన ప్రకటనను సునీల్ అరోరా స్వాగతించారు. దీని వల్ల ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉంటుందని అన్నారు. అధునాత సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఓటర్లుకేంద్రానికి రాకుండానే ఓటువేసేలా రిమోట్ ఓటింగ్ ప్రాజెక్టుకు ఈసీ శ్రీకారం చుట్టింది.