Red Alert In Mumbai : ముంబైలో రెండు రోజుల పాటు అన్ని బంద్‌!

Red Alert In Mumbai :దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ముంబయి నగరం అతలాకుతలం అవుతుంది. ఎడతెరపి

Update: 2020-08-04 07:36 GMT
Flooding In Mumbai

Red Alert In Mumbai : ముంబైలో భారీ వర్షాలుఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయి మరో సముద్రాన్ని తలసిస్తున్నాయి. వరద నీరు పూర్తిగా రోడ్లపై చేరడంతో జనజీవనం, రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించి పోయింది దీనితో ముంబయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజులు పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

రాబోయే రెండు రోజుల్లో ముంబై, దాని శివారు ప్రాంతాల్లో వర్షాలు తీవ్రమవుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 12:47 గంటలకు 4.51 మీటర్ల ఎత్తైన ఆటుపోట్లు వస్తాయని ఐఎండీ తెలిపింది. అవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు రావొద్దని కోరింది. ఇక అవసరమైన సేవలు మినహా అన్ని కార్యాలయాలను మరియు ఇతర సంస్థలను మూసివేయాలని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) అధికారులు ఒక సలహా జారీ చేశారు. ఈ మేరకు ముంబై పౌరసంఘం ఇలా ట్వీట్ చేసింది..

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచన ప్రకారం, నగరంలో మరియు శివారు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రజలు చాలా అవసరం తప్ప బయటికి వెళ్లవద్దని మరియు తీరం మరియు నీటితో నిండిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని అభ్యర్థించింది అని పేర్కొంది.

ముంబైలోని పశ్చిమ మరియు తూర్పు శివారు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య 60 నుంచి 80 మిల్లీమీటర్ల (మిమీ) వర్షపాతం నమోదైంది, తరువాత మధ్య మరియు దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాలు 30 నుండి 45 మిమీ మధ్య వర్షపాతం నమోదయ్యాయి.

Tags:    

Similar News