Coconut Water Price: అధిక ధరలు పలుకుతోన్న కొబ్బరి బోండా, నిమ్మకాయలు, సంత్రాలు

Coconut Water Price: ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోతోంది. రికార్డులకు మించి కేసులు నమోదవుతున్నాయి.

Update: 2021-04-27 03:46 GMT

రోగనిరోధక శక్తిని పెంచె పండ్లు (ఫొటో ట్విట్టర్)

Coconut Water Price: ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోతోంది. రికార్డులకు మించి కేసులు నమోదవుతున్నాయి. దీంతో అంతా రోగనిరోధక శక్తిని పెంచే పదార్ధాలపై మక్కువ చూపుతున్నారు. ఏ పదార్ధాలు తీసుకుంటే త్వరగా ఇమ్యూనిటీ వస్తోందని గూగుల్ లోనూ వెతుకుతున్నారంట. అయితే రోగ నిరోధక శక్తిని మాత్రమే పెంచుకుంటే సరిపోదు.. తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం పాటిస్తేనే కరోనా బారిన పడకుండా ఉంటామని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

కాగా, కొబ్బరి బోండాం, నిమ్మకాయలు, సంత్రాలు లాంటి పండ్లకు డిమాండ్ బాగా పెరిగిపోతోందంట. ఇవి త్వరగా రోగనిరోధక శక్తిని ఇవ్వడంతోపాటు, ఎండనుంచి కూడా మనల్ని కాపాడతాయి. దీంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ పెరగడంతో.. వ్యాపారులు వీటిని అధిక ధరలకు అమ్ముతున్నారని సామాన్యులు వాపోతున్నారు.

ప్రస్తుతం కొబ్బరి బోండాం ధర 90 నుంచి 120 రూపాయలు పలుకుతుంది. నిన్నటిదాకా సాధారణంగా, నిమ్మకాయలు కిలో 60 నుంచి 80 రూపాయలకు విక్రయిస్తుంటే, ప్రస్తుతం ఒక్క నిమ్మకాయ 15 రూపాయల ధర పలుకుతుంది. దీంతో సామాన్యులు కొనలేకపోతున్నారు.

సిట్రోస్ పండ్లు కరోనా సంక్రమణను నివారించడంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని వైద్యులు సూచించడంతో ప్రజల నుండి విపరీతమైన డిమాండ్ పెరిగింది. పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కేసుల మధ్య రోగనిరోధక శక్తిని అందించే బూస్టర్ పండ్ల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.

10 రోజుల క్రితం 20 నుంచి 25 రూపాయల్లో అమ్మిన కీవీ పండు 50 రూపాయలుగా మారింది. విదేశీ డ్రాగన్ పండ్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. అంతకుముందు డ్రాగన్ పండు 60 నుంచి 70 రూపాయల గా అమ్ముడైంది. ఇప్పుడు దాని ధర ఒక్కో ముక్కకు 120 రూపాయలకు పెరిగింది. అలాగే సీజనల్ జ్యూస్‌ గ్లాస్‌కు రూ .60 నుంచి 120 కు పెరిగింది. అంతకుముందు దాని రేటు 40 నుంచి 80 రూపాయలు ఉండేది.

Tags:    

Similar News