డా.రెడ్డీస్ చేతికి 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్

రోనావైరస్ కట్టడికి వ్యాక్సిన్ తయారు చేయడంలో ముందువరుసలో నిలిచింది రష్యా. ఇప్పటికే మహమ్మారికి విరుగుడుగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను రష్యా అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనిని ప్రపంచ ..

Update: 2020-09-17 02:42 GMT

రోనావైరస్ కట్టడికి వ్యాక్సిన్ తయారు చేయడంలో ముందువరుసలో నిలిచింది రష్యా. ఇప్పటికే మహమ్మారికి విరుగుడుగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను రష్యా అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికీ గుర్తించలేదు. దాంతో ఈ వ్యాక్సిన్ కు పెద్దగా ప్రాచుర్యం ఏర్పడలేదు. అయితే ఏదిఏమైనా రష్యా మాత్రం ఫైనల్ ట్రయల్స్ లో నిమగ్నమైంది.. వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలకు ట్రయల్స్ మరియు తయారీ బాధ్యతను ఇస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. క్లినికల్ ట్రయల్స్ కోసం ఇచ్చింది. రెడ్డీస్ తో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ఈ ఒప్పందం ప్రకారం పదికోట్ల (100 మిలియన్ల ) మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ సీఈవో కిరిల్ దిమిత్రేవ్ బుధవారం ఈ సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కరోనా టీకా కోసం ప్రస్తుతం విచారణ జరుగుతోందని.. ట్రయల్ ముగిసిన తరువాత.. భారతదేశంలో రిజిస్ట్రేషన్ తర్వాత డెలివరీ ప్రారంభమవుతుందని తెలిపారు. పూర్తిస్థాయిలో ట్రయల్స్ విజయవంతమైతే నవంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు. ఇదిలావుంటే ఈ వ్యాక్సిన్ 250 కి పైగా క్లినికల్ అధ్యయనాలలో పరీక్షించబడిందని ఇది సురక్షితం అని తేలిందన్నారు.  

Tags:    

Similar News