ఆర్బిఐ వడ్డీ రేట్లలో మార్పు లేదు..
* కీలక వడ్డీ రేట్లు యధాతథం -ఆర్బీఐ * రెపోరేటు, రివర్స్ రెపోరేటు యధాతథం -ఆర్బీఐ * 2021-22లో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా అంచనా -ఆర్బీఐ
ఆర్బీఐ పరపతి ద్రవ్య విధాన సమీక్ష నిర్వహించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. వరుసగా నాలుగోసారి కూడా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఆయన స్పష్టం చేశారు. రెపోరేటు, రివర్స్ రెపోరేటు, కీలక వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగుతాయన్నారు. 2021-22లో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా అంచనా వేస్తున్నామని చెప్పారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్.