RBI: కీలక వడ్డీరేట్లు మళ్లీ యథాతథం..
RBI: ఇలా రేట్లను యథాతథంగా కొనసాగించడం వరుసగా తొమ్మిదోసారి...
RBI: కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మరోసారి యథాతథంగా ఉంచింది. కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రెపో రేటు 4శాతంగా ఉంచగా.. రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనునన్నారు.
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుంది. అక్టోబరు సమావేశంలోనూ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇలా రేట్లను యథాతథంగా కొనసాగించడం వరుసగా తొమ్మిదోసారి.