Ration Card: రేషన్ కార్డు పోయిందా.. మరేం పర్వాలేదు ఇలా కొత్తది తీసుకోండి..!

Ration Card: రేషన్ కార్డు పోయిందా.. మరేం పర్వాలేదు ఇలా కొత్తది తీసుకోండి..!

Update: 2022-03-27 13:00 GMT

Ration Card: రేషన్ కార్డు పోయిందా.. మరేం పర్వాలేదు ఇలా కొత్తది తీసుకోండి..!

Ration Card: రేషన్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. దీని ద్వారా మీరు ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ పొందవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాదిరి ఇతర ముఖ్యమైన పత్రాలలో రేషన్ కార్డ్ ఒకటి. చాలా చోట్ల ఐడీ ప్రూఫ్‌గా కూడా వాడుతారు. కానీ కొన్ని కారణాల వల్ల రేషన్ కార్డు పోయినా లేదా దొంగిలించబడినా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సులభంగా డూప్లికేట్‌ రేషన్‌ కార్డుకోసం అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో డూప్లికేట్‌ రేషన్ కార్డుని ఎలా పొందాలో తెలుసుకుందాం.

డూప్లికేట్ రేషన్ కార్డు కోసం ఇలా ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..

1. డూప్లికేట్ రేషన్‌ కార్డ్‌ని తయారు చేయడానికి ముందుగా రాష్ట్ర ఆహార శాఖ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.

3. తర్వాత మీరు డూప్లికేట్ రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి లింక్‌పై క్లిక్ చేయాలి.

4. ఇప్పుడు మీ ముందు ఆన్‌లైన్ ఫారమ్ ఓపెన్‌ అవుతుంది. ఫారమ్‌లో అడిగిన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని నింపాలి.

5. ఇప్పుడు అభ్యర్థించిన పత్రాలను అప్‌లోడ్ చేసి సమర్పించాలి.

6. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు డూప్లికేట్ రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డూప్లికేట్ రేషన్ కార్డు కోసం ఆఫ్‌లైన్‌లో అప్లై చేయండి

1. ఆఫ్‌లైన్ డూప్లికేట్ రేషన్ కార్డ్ చేయడానికి మీరు జిల్లా ఫుడ్ అండ్ సప్లైస్ కంట్రోలర్ కార్యాలయానికి వెళ్లాలి.

2. దీని కోసం మీరు తప్పనిసరిగా కుటుంబ సభ్యుల రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లను కలిగి ఉండాలి.

3. ఇప్పుడు డూప్లికేట్ రేషన్ కార్డ్ ఫారమ్ తీసుకోండి.

4. ఫారమ్‌ను నింపిన తర్వాత కుటుంబంలోని ప్రతి సభ్యుని ఫోటో, డిపో హోల్డర్ నివేదిక, అపరాధ రుసుము, రెండు రసీదులను సమర్పించాలి.

5. ఈ పత్రాలన్ని సదరు అధికారి ధ్రువీకరించిన తర్వాత మీరు డూప్లికేట్‌ రేషన్ కార్డును పొందుతారు.

Tags:    

Similar News