మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన

Maharastra Political Crisis: రంగంలోకి దిగిన సీఎం ఉద్ధవ్‌ థాక్రే సతీమణి రష్మీ థాక్రే

Update: 2022-06-27 01:15 GMT

మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన

Maharastra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సీఎం ఉద్దవ్ థాక్రే సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. మహాసర్కార్ కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. తాజాగా మరో ట్విస్ట్ నెలకొన్నది. సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య.. రష్మీ థాక్రే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేల సతీమణులను కలుస్తున్నారు. తమ భర్తలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఒప్పించాలని కోరుతున్నారు. రష్మీ థాక్రే తలపెట్టిన వినూతన కార్యక్రమంలో ఎంత మేరకు ఉద్దవ్ థాక్రెకు అనూకూలంగా మారుతారన్నది ఆసక్తికరంగా మారింది.

మరో వైపు ఉద్దవ్, షిండే వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇరు పక్షాలు కోర్టులోనే తేల్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడా రెబల్ ఎమ్మెల్యేలు విలీనం కాకపోవడం మూడింట రెండొంతుల అంశం వర్తించడని.. రెబల్స్ పై అనర్హట వేటు ఖాయమని శివసేన నేతలు భావిస్తున్నారు. ద్రోహులు పార్టీని విడిచి వెళ్లడమే మంచిదని మంత్రి ఆధిత్యా థాక్రే విరుచుకుపడ్డారు. దమ్ముంటే రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలువాలని సవాల్ విసిరారు. ఎట్టి పరిస్థితుల్లోన రెబల్స్ అసెంబ్లీలో అడుగెట్టనివ్వబోమని శపథం చేశారు.

డిప్యూటీ స్పీక్రర్ తమపై ఇచ్చిన అనర్హత వేటు నోటీసులను సవాల్ చేస్తూ తిరుగుబాటు నేత షిండే వర్గకం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్ నోటీసుతో పాటు..శివసేన శాసనసభా పక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడంపై అత్వసర విచారణ చేపట్టాలని కోరుతూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనున్నది. వ్యక్తిగతంగా తమ వద్దకు వచ్చి అనర్హత నోటీసుపై వివరణ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించడంతో షిండే న్యాయపోరాటానికి దిగారు.

మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో మహారాష్ట్ర పోలీస్ చీఫ్.. సీఎం ఉద్దవ్ ధాక్రే ఆదేశాలు పాటిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో బలనిరూపణకు రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలో అడుగుపెట్టి వారిపై శివసేన కార్యకర్తలు దాడి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించారు. ఈ పరిస్తితుల్లో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన చేస్తున్నట్లున్నది. గవర్నర్ కూడా ఓ వైపు ఎలాంటి అలజడులు లేకుండా పోలీసు శాఖతో చర్చలు జరుపుతూనే మరో వైపు కేంద్రంతో ఎప్పటికప్పుడు ముంబైలోని పరిస్థితులను వివరిస్తున్నారు. ఈ అంశంపై కేంద్రంతో పూర్తి స్థాయి చర్చించిన తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News