Rare Yellow Turtle in Odisha: ఒడిశా తీరంతో వింత బంగారు రంగు తాబేలు.
Rare Yellow Turtle in Odisha: కొన్ని కొన్ని సార్లు మనం ఎక్కడో ఒక చోట కొన్ని వింత జంతువులను, వింత ఆకారంలో ఉన్న చెట్లనో చూస్తూనే ఉంటాం. వీటిని చూస్తే అలాగే ఆశ్చర్యంలో మునిగిపోతాం.
Rare Yellow Turtle in Odisha: కొన్ని కొన్ని సార్లు మనం ఎక్కడో ఒక చోట కొన్ని వింత జంతువులను, వింత ఆకారంలో ఉన్న చెట్లనో చూస్తూనే ఉంటాం. వీటిని చూస్తే అలాగే ఆశ్చర్యంలో మునిగిపోతాం. ఇప్పుడు ఇలాంటి వింత సంఘటనే ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని బాలసోర్ జిల్లాలోని సుజన్ పూర్ గ్రామవాసులు అరుదైన తాబేలును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతక ముందెపుడూ కనిపించని తాబేలు కనిపించడంతో గ్రాస్తులందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. ఈ సముద్ర తాబేలు పూర్తిగా పసుపు వర్ణంలో దగదగా మెరిసిపోతూ గ్రామస్తులను ఆకర్షిస్తూ కనువిందు చేసింది. వెలుతురులో ఇది బంగారం పూత పూసినట్టుగా మెరిసిపోతుండటం విశేషం. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆ తీరప్రాంత గ్రామవాసులు అటవీప్రాంత సంరక్షణ అధికారి భానుమిత్ర ఆచార్యకు సమాచారం అందించారు.
దాన్ని చూసిన భానుమిత్ర ఆచార్య మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇలాంటి రంగులో తాబేలును చూడలేదని అన్నారు. ఆయన ఈ తాబేలును క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఎంతో అరుదైనదని అన్నారు. ఈ జాతి తాబేలు చాలా అరుదుగా కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇవి ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ట్రియంకిడియా జాతికి చెందిన తాబేలు ఉన్నాయని చెప్పారు. మృదువైన షెల్‌ను కలిగి ఉండే తాబేళ్లు దాదాపు 30 కిలోల బరువు వరకు పెరిగి 50 సంవత్సరాలు బతుకుతాయని చెప్పారు. దీని ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నందా ఇది ఒక అల్బినో అని పేర్కొన్నారు. కానీ పసుపు రంగులో ఉన్నవి కనిపించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఇలాంటిదే సింధ్ ప్రాంతంలో కొన్నేళ్ల కిందట కనిపించిందని తెలిపారు. ఈ తాబేలుకు కళ్లు గులాబీ రంగులో ఉండడం కూడా జన్యుపరమైన లోపమేనని వివరించారు.