Ramzan 2021 India: రేపే భారత్ లో రంజాన్ పండుగ
Ramzan 2021 India: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈద్ ను జరుపుకోవాలని మత పెద్దలు సూచించారు.
Ramzan 2021 India: దేశవ్యాప్తంగా రేపు రంజాన్ పర్వదిన వేడుకలు జరగనున్నాయి. బుధవారం నెలవంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్ ఉపవాసదీక్షను కొనసాగించాలని, 14వ తేదీన ఈద్ జరుపుకోవాలని రువాయత్-ఎ- హిలాల్ కమిటీ, ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్‌తో పాటు పలువురు మత పెద్దలు ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో రంజాన్ పండుగను గురువారం జరుపుకుంటున్నారు.
దేశంలో గత 30 రోజులుగా ముస్లింలు చేపట్టిన ఉపవాస దీక్షలు నేటి తో ముగియనున్నాయి. ఈ రోజు నెలవంక దర్శనం అనంతరం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు రేపు నిర్వహించనున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే ఒక్క సౌదీ దేశాల్లో మాత్రం ఈ రోజు పండుగను నిర్వహిస్తున్నారు. సౌదీ ఆరేబియాతో పాటు దుబాయ్, కువైట్ దేశాల్లో రంజాన్ వేడుకులు గురువారమే జరుగుతున్నాయి.
దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాదిగా కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని మతపెద్దలు, పలువురు ముస్లిం నాయకులు సూచిస్తున్నారు. సామూహిక ప్రార్థనల వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని ఎవరి ఇళ్లల్లో వారే చేసుకోవాలని పేర్కొంటున్నారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రార్థనలు నిర్వహించవద్దని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సర్క్యూలర్‌ను జారీ చేశాయి.