Padma Awards 2021: రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

* 2020లో 119 మందిని వరించిన పద్మాలు * పలు రంగాల్లో సేవలందినవారికి అవార్డుల ప్రదానం

Update: 2021-11-08 07:07 GMT

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం(ఫైల్ ఫోటో)

Padma Awards 2021: రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2020 సంవత్సరంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ అవార్డులు ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

2020లో మొత్తం నూట పందొమ్మిది మందిని పద్మాలు వరించాయి. దీంట్లో 7 పద్మ విభూషణ్‌, 10 పద్మ భూషణ్‌, 102 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. మొత్తం 119 మందిలో 29 మంది మహిళలు ఉన్నారు. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు పద్మ భూషణ్‌, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్‌, సింగర్‌ అద్నాన్‌ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్‌ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు.

16 మందికి చనిపోయిన అనంతరం అవార్డు ప్రకటించారు. అరుణ్‌ జైట్లీకి పద్మ విభూషణ్‌‌, సుష్మా స్వరాజ్‌కు పద్మ భూషణ్‌ను ప్రకటించారు. ప‌ద్మ అవార్డులు స్వీక‌రించిన వారిలో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కూడా ఉన్నారు. ఇక వైద్య రంగంలో ఎయిర్‌ మార్షల్‌ డాక్టర్‌ పద్మ భందోపాద్యాయకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు.

Tags:    

Similar News