Baba Ramdev: డాక్టర్లకు క్షమాపణ చెప్పిన బాబా రాందేవ్
Baba Ramdev: అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు బాబా రామ్ దేవ్ ప్రకటించారు.
Baba Ramdev: అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు యోగాగురు బాబా రామ్ దేవ్ ప్రకటించారు. అంతేకాకుండా ఎవరి మనసులనైనా కష్టపడితే క్షమించాలని కోరారు "యోగా గురువు రామ్‌దేవ్ అల్లోపతి వైద్యానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనలను ఉపసంహరించుకుని, ఈ సమస్యపై వివాదాన్ని నిలిపివేసిన విధానం ప్రశంసనీయం, అతని పరిపక్వతను చూపిస్తుంది అని కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. భారత ప్రజలు కోవిడ్‌ను ఎలా ఎదుర్కొన్నారో ప్రపంచానికి చూపించాలి. -19. అయితే, మా విజయం ఖచ్చితంగా ఉంది! " అంటూ కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఇదిలావుంటే, అల్లోపతి వైద్యంపై వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని. ఇది కరోనా యోధులను అవమానించడమే కాదు.. ఆరోగ్య కార్యకర్తల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడమే. మీ మాటలు ఉపసంహరించుకోండి' అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ యోగా గురు రాందేవ్‌బాబాకు ఆదివారం ఘాటుగా లేఖ రాశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలు కూడా దెబ్బ తీశారంటూ పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారని, ఈ పోరాటాన్ని నీరుగార్చవద్దని కోరారు. అంతకుముందు, 'అల్లోపతి పనికిమాలిన వైద్యం' అంటూ రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోపై శనివారం భారత వైద్యమండలి (ఐఎంఏ) తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.