Mahant Nritya Gopaldas Tests Covid-19 : రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్ కి కరోనా!

Mahant Nritya Gopaldas Tests Covid-19 : అయోధ్య రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ కరోనా బారిన పడ్డారు. గత

Update: 2020-08-13 07:59 GMT
coronavirus (File Photo)

Mahant Nritya Gopaldas Tests Covid-19 : అయోధ్య రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా అయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా గురువారం అయనకి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయనకు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోని బృందం మెరుగైన చికిత్స అందిస్తోంది. అటు నృత్య గోపాల్ దాస్ ఆరోగ్య పరిస్థితి పైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అరా తీశారు. ఆయనకి మెరుగైన చికిత్స అందించాలని అధికారులని ఆదేశించారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం..

ఇక ఇది ఇలా ఉంటే ఈ నెల (ఆగస్టు) 5 న ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో జరిగిన రామమందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా అయన వేదికను పంచుకున్నారు. ఇప్పుడు ఆయనకి కరోనా అని తేలడం ఆందోళనను కలిగిస్తుంది. ఇక అదే వేదిక పైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. ఇక రామమందిరం వద్ద భద్రత విధుల్లో పాల్గొన్న 16 మంది పోలీసులకు కూడా వైరస్ సోకింది. 

Tags:    

Similar News