రాజ్యసభ సభ్యులకు కరోనా భయం.. పెద్దల సభలో 60 ఏళ్లు పై బడిన ఎంపీలు..

Update: 2020-09-08 12:26 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. భారత్‌లో రోజుకు 80వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తుంది. కరోనా సోకిన వారిలో యువత కోలుకుంటుంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, వయసు మీద పడిన వారికి మాత్రం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలపై కరోనా ప్రభావం చూపనుంది.

కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ ఉభయ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కరోనా విజృంభిస్తున్న సమయంలో పెద్దల సభలకు కోవిడ్ భయం పట్టుకుంది. వయసు మీద పడిన వారు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాజ్యసభ సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా వృద్ధులు అధికంగా ఉన్న రాజ్యసభ సభ్యుల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెద్దల సభలో ఉన్న చాలా మంది 60 ఏళ్లు ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ సభలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 244 మంది సభ్యుల్లో 130 మంది 60 ఏళ్ల పై బడిన వారే ఉన్నారు. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 87 ఏళ్లతో అందరికంటే పెద్దవారుగా ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో అకాళీదళ్ ఎంపీ సుఖ్‌దేవ్ సింగ్‌ ధిండ్సా 84 ఏళ్లు, టీఆర్‌ఎస్ నేత కే. కేశవరావు 81, AIADMK సభ్యుడు ఎస్‌.ఆర్‌.బాలసుబ్రహ్మణ్యన్‌ 81 ఏళ్లుగా ఉన్నారు.

ఇలాంటి పెద్దల వయసు దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ స్పీకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్‌ అంతటా శానిటైజ్ చేస్తున్నారు. ఎంపీలకు, ఎంపీలతో పాటు వచ్చే వ్యక్తిగత సిబ్బందికి 72గంటల ముందు కరోనా పరీక్షలు, మాస్కులు తప్పని సరి చేశారు.

Tags:    

Similar News