Rajya Sabha Members Assets: అత్యధిక ఆస్తులు కలిగిన వారిలో వైసీపీ ఎంపీ
Rajya Sabha Members Assets: అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణ ప్రకారం 89% మంది రాజ్యసభ సభ్యులు ఒక కోటికి పైగా ఆస్తులను ప్రకటించినట్లు వెల్లడైంది.
Rajya Sabha Members Assets: అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణ ప్రకారం 89% మంది రాజ్యసభ సభ్యులు ఒక కోటికి పైగా ఆస్తులను ప్రకటించినట్లు వెల్లడైంది. అలాగే సిట్టింగ్ రాజ్యసభ సభ్యులలో నాలుగింట ఒకవంతు తమపై క్రిమినల్ కేసులు ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) బుధవారం ప్రమాణ స్వీకార అఫిడవిట్ల విశ్లేషణలో సభ్యులు పేర్కొన్నారని తెలిపింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 233 రాజ్యసభ స్థానాల్లో 229 మందిని విచారించగా 54 మంది ఎంపీలు అంటే 24% మంది క్రిమినల్ కేసులు ప్రకటించారని తేలింది.
229 మంది ఎంపీలలో, కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయగా, 28 మంది అంటే 12% మంది తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. 77 మంది బిజెపి ఎంపిలలో 14 మంది, కాంగ్రెస్ ఎంపిలలో ఎనిమిది మంది తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులు ప్రకటించారని నివేదిక పేర్కొంది.
229 మంది ఎంపీలలో 203 మంది అంటే 89% మంది ఒక కోటికి పైగా ఆస్తులను ప్రకటించారని, ఇందులో 90% బిజెపి ఎంపిలు, 93% కాంగ్రెస్ ఎంపిలు, 100% ఎఐఎడిఎంకె ఎంపిలు, 69% తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. బీహార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) ఎంపి అత్యధికంగా, 4,078 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్‌ఆర్‌సిపి ఎంపి ఆళ్ల అయోధ్య రామి రెడ్డి 2,577 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు.