భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ యుద్ధ విమానం
*భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ యుద్ధ విమానం *రాఫెల్‌కు ఆయుధ పూజ నిర్వహించిన రాజ్‌నాథ్ *తొలి విడతలో భాగంగా భారత్‌కు 36 రాఫెల్ యుద్ధ విమానాలు *ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్ మూడు రోజుల పర్యటన
భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ యుద్ధ విమానం చేరింది. విజయదశమి సందర్భంగా ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా రాఫెల్‌కు ఆయన ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్సుడు మెక్రాన్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలపై రాజ్‌నాథ్ చర్చించారు. ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్ మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఫ్రాన్స్ రక్షణ శాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో రాజ్‌నాథ్ సమావేశమై.. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం బలోపేతంపై చర్చిస్తారు. తొలి విడతలో భాగంగా భారత్‌కు 36 రాఫెల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి.
Had an excellent meeting with the President of France Mr. @EmmanuelMacron at Elysee Palace in Paris today.
— Rajnath Singh (@rajnathsingh) October 8, 2019
We had a comprehensive discussion covering a wide range of issues. pic.twitter.com/WFInexU8sm