Rajnath Singh Pays Tributes to Kargil Heroes: కార్గిల్ వీరులకు రాజ్‌నాథ్‌సింగ్‌ ఘన నివాళి

Rajnath Singh Pays Tributes to Kargil Heroes: భార‌త స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన కార్గిల్‌లో పాకిస్థాన్ దురాక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డింది. 1999, జూలై 26న పాకిస్తాన్‌పై భారత సైన్యం విజయం సాధించింది

Update: 2020-07-26 06:46 GMT
rajnath singh

Rajnath Singh Pays Tributes to Kargil Heroes: భార‌త స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన కార్గిల్‌లో పాకిస్థాన్ దురాక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డింది. ఈ ప్రాంతంలో 1999, జూలై 26న పాకిస్తాన్‌పై భారత సైన్యం విజయం సాధించింది. విజయానికి గుర్తుగా ప్రతిఏడాది కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 21 ఏండ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్గిల్ విజయాన్ని అందించిన సైనికుల బలిదానం ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

ఆనాటి యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలర్పించిన సైనికులకు శ్రధ్ధాంజలి ప్ర‌క‌టించారు. సైనికుల మాదిరే మనం కూడా క్రమశిక్షణ, అంకిత భావం కలిగిఉండాలని ఆయన కోరారు. దేశ సరిహద్దుల్లో వారు మన రక్షణ కోసం శ్రమిస్తుంటే మనం శాంతి, సామరస్యాలతో ఉండాలని. ఇవే అమ‌ర వీరుల‌కు మనమిచ్ఛే నిజ‌మైన నివాళి అని ఆయన అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద రాజ్ నాథ్ సింగ్ తో బాటు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, త్రివిధ దళాల అధిపతులు కూడా శ్రధ్ధాంజలి ఘటించారు. కార్గిల్ భార‌త సైనికుల విజ‌యం యావత్ దేశం గర్వించదగిన విషయం అని చెప్పారు. జాతీయ భద్రత పరిధిలో మన ప్రతిఅడుగూ ఆత్మ రక్షణ కోసమేనని, దాడి ఎంతమాత్రం కాదని మాజీ ప్రధాని వాజ్‌పేయి తరచూ చెప్పేవారని ఆయన గుర్తుచేశారు. 


Tags:    

Similar News