అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై సర్వీస్ చీఫ్‌లతో రాజ్‌నాథ్ సమావేశం
*రాజ్‌నాథ్ సింగ్ నివాసానికి చేరుకుంటున్న.. నేవీ చీఫ్ అడ్మిరల్, ఐఏఎస్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్
Rajnath Singh: అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై సర్వీస్ చీఫ్‌లతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. నేవీ చీఫ్ అడ్మిరల్, ఐఏఎస్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్‌తో రాజ్‌నాథ్ సింగ్ చర్చిస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్, దేశవ్యాప్త ఆందోళనలపై చర్చించనున్నారు. సమీక్ష అనంతరం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత ఆందోళనలు చేస్తోంది. ఏడు రాష్ట్రాల్లో ఆందోళనలు చేస్తూ పలు చోట్ల హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. కొత్త మిలిటరీ రిక్రూట్‌మెంట్ పాలసీ అగ్నిపథ్‌పై పలు రాష్ట్రాల్లో కోపోద్రిక్తులైన యువకులు రైళ్లకు నిప్పు పెట్టడం, పోలీసులతో ఘర్షణ పడ్డారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అగ్నిపథ్ పథకాన్ని సమర్ధిస్తూ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఆందోళనలు ఉధృతం కావడంతో ఇవాళ అగ్నిపథ్‌పై రాజ్‌నాథ్ సింగ్ కీలక సమీక్ష నిర్వహించారు.