7 రాష్ట్రాల సరిహద్దుల్లో 44 వంతెనలు.. ఒకేసారి ప్రారంభం..
7 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో 44 వంతెనలను రక్షణ కాన్ఫరెన్స్ ద్వారా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం
7 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో 44 వంతెనలను రక్షణ కాన్ఫరెన్స్ ద్వారా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. అంతేకాదు రాజ్ నాథ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఒక సొరంగం నిర్మాణానికి పునాది రాయి కూడా వేశారు. ఈ వంతెనలకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉండటమే కాకుండా, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని ఏర్పాటు చేయడంలో కూడా సహాయపడుతుందని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) తెలిపింది. ఈ వంతెనలను లడఖ్, అరుణాచల్ ప్రదేశ్,
సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్లలో నిర్మించారు. వీటి సహాయంతో, సైన్యం యొక్క సాయుధ దళాలు సరిహద్దులోని ఫార్వర్డ్ స్థానానికి త్వరగా చేరుకోవచ్చని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ తెలిపింది. కాగా వీటన్నింటినీ ఆర్మీ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ తయారు చేసింది. లడఖ్‌లో 7 వంతెనలు నిర్మించారు. ఇవే కాకుండా, జమ్మూ కాశ్మీర్‌లో 10, హిమాచల్‌లో 2, ఉత్తరాఖండ్, అరుణాచల్‌లో 8, సిక్కిం, పంజాబ్‌లో 4 వంతెనలు నిర్మించారు.