డ్రాగన్‌కు రాజ్‌నాథ్ దిమ్మదిరిగే రిప్లై

Rajnath Singh: చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని బోర్డర్ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ B.R.Oను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు.

Update: 2022-05-08 08:45 GMT

డ్రాగన్‌కు రాజ్‌నాథ్ దిమ్మదిరిగే రిప్లై

Rajnath Singh: చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని బోర్డర్ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ B.R.Oను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కు కావాల్సిన అన్ని సదుపాయాలు అందిస్తామన్నారు రాజ్ నాథ్ సింగ్. కేంద్రం నుంచి ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమన్నారు. ఓవైపు భారత్ సరిహద్దుల వరకు వేగంగా చైనా రోడ్ల నిర్మాణంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. సరిహద్దుల్లోకి వచ్చి ఇండియాకు వేగంగా చేరుకోడానికి గత కొంత కాలంగా చైనా రోడ్లను, బ్రిడ్జిలను నిర్మిస్తోంది. దీంతో ముప్పు పసిగట్టిన కేంద్రం సైతం సరిహద్దుల్లో ఆధునిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా రోడ్లను వేగవంతంగా నిర్మించాలని B.R.Oను ఆదేశించింది. 63వ B.R.O రెయిజింగ్ డే సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం అన్ని విధాలుగా B.R.Oకు సహకరిస్తోందన్నారు రాజ్‌రాజ్‌నాథ్ సింగ్. ఇటీల బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కు బడ్జెట్లో 40 శాతం నిధులు పెంచారు. 2022-23 సంవత్సరానికి గాను B.R.Oను రూ. 3,500 కోట్ల నిధులు కేటాయించారు. ప్రభుత్వ డిఫెన్స్ స్ట్రాటజీలో భాగంగానే రోడ్లు నిర్మాణం తలపపెట్టామన్నారు రాజ్ నాథ్ సింగ్. సరిహద్దుల్లో నివశిస్తున్న ప్రజలకు రవాణాతోపాటు, భద్రత ఇంప్రూవ్ అవుతోందన్నారు రాజ్ నాథ్ సింగ్ ప్రధాని న్యూ ఇండియా కాన్సెప్ట్‌లో భాగంగా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి దక్షిణసియా, ఆగ్నేయ ఆసియాను వేగంగా చేరుకునే అవకాశం లభిస్తోంది. గత ఏడాదిలో B.R.O.మొత్తం 102 ఇన్ ఫ్రా ప్రాజెక్టులతోపాటు, 15 రోడ్లు నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు సరిహద్దుల్లో 60 వేల కిలో మీటర్ల మేర రోడ్లను, 840 బ్రిడ్జిలను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది. 

Tags:    

Similar News