Agnipath Protests: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
Agnipath Protests: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Agnipath Protests: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో నియమాకాలకు సవరణలు చేయబడుతున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు రక్షణ శాఖ శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించింది.
''తగిన అర్హత ఉన్న అగ్నివీరులకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్ట్‌లతో పాటు 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ విభాగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రస్తుతమున్న ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాతో పాటు ఈ రిజర్వేషన్ అమలవుతుంది. ఇందుకోసం నియామక నిబంధనల్లో తగిన సవరణలు చేయనున్నాం. వయో పరిమితి సడలింపు కూడా చేయనున్నాం'' అని రక్షణశాఖ వెల్లడించింది.