రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి విడుదల
Chennai: పెరారి వలన్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
Chennai: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న పెరారి వలన్ జైలు నుంచి విడుదలయ్యాడు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ పెరారి వలన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై గత వారం తుది విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో మంగళవారం సాయంత్రం చెన్నైలోని జైలు అధికారులు పెరారి వలన్‌ను విడుదల చేశారు. పోలీసుల అనుమతి లేనిదే అతని స్వగ్రామం జోలార్‌పెటాయ్‌ని వీడొద్దని సూచించింది. ఈ కేసులో ఇప్పటికే అతడు 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. దీంతో ఈ కేసులో తొలి బెయిల్ లభించిన వ్యక్తిగా పెరారి నిలిచాడు.