Rajinikanth: పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రజినీ
Rajinikanth: అభిమానులతో చర్చించి నిర్ణయం ప్రకటించిన రజినీ * రజినీ మక్కల్ మండ్రం రద్దు చేస్తున్నట్లు ప్రకటన
Rajinikanth: పొలిటికల్ రీ ఎంట్రీపై రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ మరోసారి ప్రకటించేశారు. ఇవాళ తన అభిమానులతో సమావేశం ఏర్పాటు చేయడంతో.. తలైవా రీ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాను పాలిటిక్స్‌లోకి రానని.. భవిష్యత్‌లోనూ వచ్చే ప్రసక్తి ఉండబోదని స్పష్టం చేశారు. తన పార్టీ రజినీ మక్కల్ మండ్రం రద్దు చేస్తున్నట్లు తెలుపుతూ... ఇకపై రజినీ అభిమాన సంక్షేమ మండ్రం మాత్రమే ఉంటుందని స్పష్టతనిచ్చారు. ఆర్‌ఎంఎం సభ్యులు కేవలం సేవా కార్యక్రమాల్లోనే ఉంటారన్నారు.