Sachin Pilot removed from Ashok Gehlot Cabinet: పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవుల నుంచి సచిన్ పైలట్ తొలగింపు!
Sachin Pilot removed from Ashok Gehlot Cabinet: రాజస్థాన్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి..
Sachin Pilot removed from Ashok Gehlot Cabinet: రాజస్థాన్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి నుంచి సచిన్ పైలట్‌ను తొలగించినట్లు ఆ పార్టీ తెలిపింది.. డిప్యూటీ సీఎం గానే కాకుండా పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా ఆయనను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా మంగళవారం వెల్లడించారు. సచిన్ పైలట్ తో పాటిగా ఆయన వెంట ఉన్న విశ్వేందర్ సింగ్, రమేష్ మీనాలను మంత్రి పదవుల నుంచి నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. దీనితో రాజస్థాన్ రాజకీయాలు ఉహించని మలుపులు తిరుగుతున్నాయి.
ఈ సందర్భంగా రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. సచి న్ పైలట్ తో పాటుగా ఎనమిది మంది బీజేపీ కుట్రలో చిక్కుకోని ఎనమిది కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారని, అందుకే వారిని మంత్రివర్గం నుంచి తప్పించినట్లుగా వెల్లడించారు..ఇక సచిన్ పైలట్ సీఎల్పీ సమావేశానికి కూడా గైర్హాజరు అయ్యారు.. దీనితో ఆ భేటీలో పాల్గొన్న 102 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ ను పార్టీ నుంచి తొలిగించాలని డిమాండ్ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక సచిన్ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ దోత్సారాను రాజస్థాన్ పీసీసీ చీఫ్‌గా నియమించినట్లు ఆయన రణదీప్ తెలిపారు.
సచిన్ పైలట్ కి కాంగ్రెస్ పార్టీ ఉద్వాసన పలకడంతో ఆయన బీజేపీలో చేరతారా లేకా కొత్త పార్టీ ఏమైనా పెడతారా అన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది.. ఇక 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సొంత బలం 107. ప్రభుత్వ మనుగడకు 101 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం 102 ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.