Rajasthan Political Crisis Updates: రేపు రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ?
Rajasthan Political Crisis Updates: రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ తోపాటు ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తొలగించారు.
Rajasthan Political Crisis Updates: రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ తోపాటు ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తొలగించారు. దీంతో ప్రస్తుతం మూడు మంత్రి పదవులకు ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ఈ శాఖలతో పాటు గతంలో ఖాళీగా ఉన్న మరో ఐదు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలనీ సీఎంఅశోక్ గెహ్లాట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే రేపు రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ జరిగే అవకాశం ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
రాజస్థాన్‌లో ప్రస్తుతం 15 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది రాష్ట్ర మంత్రులు మొత్తం 25 మంది ఉన్నారు. అయితే తాజాగా సచిన్ పైలట్, విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాకు ఉద్వాసన పలికిన గెహ్లాట్ సర్కార్.. ఖాళీ అయిన పదవులను అసంతృప్తి నేతలకు ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల సంఖ్య అనుగుణంగా మొత్తం 30 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. ముగ్గురు తొలగింపులు తరువాత ప్రస్తుతం మంత్రుల సంఖ్య 22గా ఉంది. అటువంటి పరిస్థితిలో, గెహ్లాట్ 8 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.