Rajasthan Political Crisis Updates: సచిన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటుకు సిద్ధమైన కాంగ్రెస్

Rajasthan Political Crisis Updates: రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సచిన్ పైలట్‌ను , డిప్యూటీ సీఎంగాను, రాష్ట్ర అధ్యక్షుడిగాను తొలగించిన కాంగ్రెస్.. ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా చేసే ప్రక్రియను కూడా ప్రారంభించింది

Update: 2020-07-15 09:19 GMT
Rajasthan Political Crisis Updates

Rajasthan Political Crisis Updates: రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సచిన్ పైలట్‌ను , డిప్యూటీ సీఎంగాను, రాష్ట్ర అధ్యక్షుడిగాను తొలగించిన కాంగ్రెస్.. ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా చేసే ప్రక్రియను కూడా ప్రారంభించింది. పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి బుధవారం నోటీసు ఇచ్చారు. శాసనసభాపక్ష సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వివిరణ ఇవ్వాలని స్పీకర్ పేర్కొన్నారు. శుక్రవారం నాటికి వీటిపై సమాధానం ఇవ్వాలని కోరారు.

కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. కీలకమైన శాసనసభా పక్ష సమావేశానికి కూడా హాజరు కాలేదని.. అందువల్ల వారిని అనర్హులుగా గుర్తించాలని కాంగ్రెస్ లోని కొంతమంది ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే మాట్లాడుతు.. సచిన్ పైలట్‌తో సహా 19 మంది సభ్యులు రెండు రోజుల్లో జరిగిన సమావేశాలకు హాజరు కాలేదని అందువల్ల వారిపై చర్యలు ఉంటాయని అన్నారు.

పార్టీ విప్ ధిక్కరించడంతో ఈ చర్య తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రెబల్ ఎమ్మెల్యేల వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపారు. అంతేకాదు వారి అధికారిక నివాసాల్లోనూ నోటీసులు అంటించారు. ఫ్లోర్ టెస్ట్ అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ చర్య తీసుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News