Rajasthan Political crisis Updates: రాజస్థాన్ లో రాజకీయ డ్రామా రోజుకో మలుపు.. తాజాగా..

Rajasthan Political crisis Updates: రాజస్థాన్ లో రాజకీయ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది

Update: 2020-07-19 08:57 GMT
BJP Demands CBI Probe into Rajasthan Audio Tapes

Rajasthan Political crisis Updates: రాజస్థాన్ లో రాజకీయ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ బేరసారాలు సాగించినట్టు కొన్ని ఆడియో టేపులు బయటికి వచ్చాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఇవి నకిలీ ఆడియో టేపులంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికే కాంగ్రెస్ ఈ కుట్రకు తెరతీసిందని బీజేపీ ఆరోపిస్తోంది. రాజస్థాన్ లో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీ పాపాలే కారణమని ఇందులో తమ పార్టీ ప్రమేయం లేదని బీజేపీ అంటోంది. కుట్రలు కాంగ్రెస్ పార్టీ సొంత ఇంట్లోనే జరిగాయని.. బీజేపీపై ఆరోపణలు చేయడం అర్థరహితమని అన్నారు కమలం పార్టీ నేతలు. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ నిజమైతే ఎవరి అనుమతితో ట్యాపింగ్ చేసారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలని డిమాండ్ చేసింది బీజేపీ. టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన

ప్రోటోకాల్ ను ప్రభుత్వం ఉల్లంగిస్తోందా? రాజస్థాన్ లోని అందరూ రాజకీయ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారా? రాజస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీని తలపించేలా లేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆడియో టేపులలో వాస్తవాలేంటి? టెలిఫోన్ ట్యాపింగ్ లకు లోబడే చేశారా..? అనే అంశాలపై సిబిఐ విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉపసంహరించుకున్న మరో ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సీఎం అశోక్ గెహ్లాట్ కు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు అశోక్ గెహ్లాట్ కు మద్దతు ఇస్తూ అదే క్రమంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని షరతు విధించారు.

Tags:    

Similar News