Ashok Gehlot Demand For Assembly Session: రాజస్థాన్ రాజకీయం.. ట్విస్ట్ ఇచ్చిన గెహ్లాట్

Ashok Gehlot Demand For Assembly Session: రాజస్థాన్ రాజకీయం పుట్టకో మలుపు తిరుగుతోంది..

Update: 2020-07-26 13:27 GMT

Ashok Gehlot Demand For Assembly Session: రాజస్థాన్ రాజకీయం పుట్టకో మలుపు తిరుగుతోంది.. నిన్నటివరకూ గవర్నర్ ను కలిసి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పట్టుబట్టారు.. అయితే తాజాగా ఆయన మరో వ్యూహం రచించారు. ఆదివారం గవర్నర్ కు రాసిన లేఖలో జులై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. కరోనా నియంత్రణ, పరీక్షలు సహా వివిధ అంశాలపై చర్చించాలని అజెండాలో చేర్చారు. అయితే అందులో బలపరీక్ష అంశం మాత్రం పొందుపరచలేదు. దీనిపై గవర్నర్ ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. సోమవారం సాయంత్రానికి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే గవర్నర్ కు సమర్పించిన లేఖలో బలపరీక్ష లేకపోవడంపై పైలట్ వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

అంతేకాదు ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం అయింది. అనంతరం అజెండాను తయారుచేసిన క్యాబినెట్ దీనిని గవర్నర్ కు పంపించారు. అయితే ఎందుకు ఇలా చేశారన్నది మాత్రం కాంగ్రెస్ శ్రేణులకు అంతుబట్టడం లేదు. వ్యూహంలో భాగంగానే సీఎం అశోక్ గెహ్లాట్ కొత్త ఎత్తుగడ వేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇప్పటికే మూడు సార్లు కల్‌రాజ్‌మిశ్రాతో భేటీ అయిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో‌ ఫోర్ల్‌టెస్ట్‌కు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News