Rajasthan political crisis: రాజస్థాన్ సంక్షోభం : కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం

Update: 2020-07-17 05:40 GMT

Rajasthan political crisis : రాజస్థాన్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాల ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేయాలని రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయన కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు షెకావత్ ఫోన్లో చేసిన సంభాషణను పేర్కొంటూ ప్రభుత్వం కూల్చడానికి చేసిన కుట్రను ఆయన వర్ణించారు.

ఈ టేపులను ఆధారంగా చేసుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించామని ప్రకటించారు. శాసనసభ్యుడిగా తనతో సహా 19మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్‌ సీపీ జోషి ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ సచిన్‌ పైలట్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై రాజస్థాన్‌ హైకోర్టు విచారణ జరపనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు పైలట్‌ పిటిషన్‌పై విచారణ జరగనుండగా అనర్హత నోటీసులపై సమాధానం చెప్పాలని అసమ్మతి ఎమ్మెల్యేలకు స్పీకర్‌ విధించిన గడువు కూడా అదే సమయానికి ముగియనుంది. ఈనేపథ్యంలో స్పీకర్‌ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.



Tags:    

Similar News