Rajasthan CM Ashok Gehlot: అవసరమైతే ప్రధాని ఇంటి ముందు ధర్నా.. రాజస్థాన్ సీఎం నిర్ణయం
Rajasthan CM Ashok Gehlot: రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గవర్నర్ ముందు దర్నా చేసిన తరువాత స్పందన
Rajasthan CM Ashok Gehlot: రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గవర్నర్ ముందు దర్నా చేసిన తరువాత స్పందన తనుకు అనుకూలంగా లేకపోవడంతో ప్రధాని ఇంటి ముందుకు వేదిక మార్చినట్టు తెలుస్తోంది..
రాజస్థాన్ రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఇప్పటికే హైకోర్టు, సుప్రీం కోర్టుల వరకు వెళ్లిన రాజకీయం ఇప్పుడు గవర్నర్ కోర్టులో ఉండగా… రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన అనుభవాన్ని అంతా రంగరించి వ్యూహాలకు పదును పెడుతున్నాడు.
ఇప్పటికే గవర్నర్ ను తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశపర్చాలని సీఎం కోరగా… గవర్నర్ కరోనా వైరస్ నేపథ్యంలో మంచిది కాదంటూ సూచించారు. కానీ సీఎం మాత్రం సోమవారం నుండి అసెంబ్లీని సమావేశపర్చాల్సిందేనని పట్టుబట్టారు. గవర్నర్ కేంద్రం ఒత్తిడిలో ఉన్నారంటూ సీఎం ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా రంగంలోకి దిగింది. గవర్నర్ తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు.
అవసరం అయితే భారత రాష్ట్రపతిని కలిసి రాజ్యాంగాన్ని కాపాడమని కోరుతాం. ఆ తర్వాత ప్రధాని నివాసం ముందు ఎమ్మెల్యేలతో సహా ధర్నా చేద్దాం అంటూ సీఎం గెహ్లాట్ సీఎల్పీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం సాగుతోంది.
అయితే సీఎల్పీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారని కావాలనే సీఎం వర్గం బయటకు లీక్ చేసిందని, తద్వారా గవర్నర్ తో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి పెంచే వ్యూహాం దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇష్యూలోకి బీజేపీ ఎంటరవటంతో… ఇక రాజకీయాలు వేగంగా మారబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.