Rajasthan: మళ్లీ కొలువుదీరిన రాజస్థాన్ కేబినెట్
Rajasthan: 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం
Rajasthan: రాజస్తాన్ ప్రభుత్వం కేబినెట్ మళ్లీ కొలువుదీరింది. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే సాయంత్రం 4 గంటల సమయానికి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్ గెహ్లాట్ కొత్త టీమ్‌లో ముగ్గురు పాతవారికి 12 మంది కొత్త వారికి అవకాశం దక్కింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ అజయ్ మాకెన్ పాల్గొన్నారు.
మరోవైపు సచిన్ పైలట్ తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 16 నెలల తర్వాత క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. కొత్త క్యాబినెట్‌లో సచిన్ పైలట్ మద్దతుదారులకు ఎక్కువ ప్రాధాన్యమే లభించింది. రమేష్ మీనా, విశ్వేంద్ర సింగ్‌లకు తిరిగి మంత్రి పదవులు పొందారు. వీరితో పాటు బ్రిజేంద్ర సింగ్ ఓలా, మేమారన్ చౌదరి, మురీలాల్ మీనాకు మంత్రి వర్గంలో నూతనంగా చోటు దక్కింది.