మాయదారి కరోనా ఎవరినీ వదలడం లేదు. వైరస్ బారినపడి చనిపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగతూనే ఉంది. రాజస్థాన్‌లో బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరీ కోవిడ్‌తో పోరాడుతూ చనిపోయారు. అక్టోబర్‌లో ఆమెకు వైరస్ సోకగా ఆ తర్వాత ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. మహేశ్వరి మరణంపై ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆమె ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్లు చేశారు.