నాగౌర్‌ నుంచి ఢిల్లీకి రాజస్థాన్‌ యువకుడు పరుగు.. 50 గంటల పరుగు.. 350 కిలోమీటర్లు అలుపులేకుండా

Rajasthan - Army Aspirant: *సురేశ్‌ భించర్‌కు ఆర్మీలో చేరాలన్న కోరిక *రెండేళ్లుగా నియామకాలు లేక నిరాశ

Update: 2022-04-07 07:43 GMT

నాగౌర్‌ నుంచి ఢిల్లీకి రాజస్థాన్‌ యువకుడు పరుగు.. 50 గంటల పరుగు.. 350 కిలోమీటర్లు అలుపులేకుండా

Rajasthan - Army Aspirant: సైన్యంలో చేరాలన్న పట్టుదలతో ఓ యువకుడు ఏకంగా 350 కిలోమీర్లు పరుగు తీశాడు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి జాతీయ పతాకంతో 50 గంటల పాటు అలుపెరుగకుండా పరుగులు తీసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు సురేష్‌ భించర్‌. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాకు చెందిన 24 ఏళ్ల సురేష్‌ భించర్‌కు సైన్యంలో చైరాలని కోరిక. అయితే రెండేళ్లుగా ఆర్మీలో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు.

దీంతో సైన్యంలో చేరాలన్న యువకులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో యువతకు ఉత్సాహం నింపేందుకు ఓ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలుసుకున్న సురేశ్‌.. నాగౌర్‌ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి జాతీయ జెండాతో పరుగులు పెట్టాడు. 50 గంటల పాటు అలుపెరుగకుండా సురేశ్‌ పరిగెత్తడం అందరినీ ఆశ్చర్యపరింది. తనతో పాటు ఎందరో ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. అయితే రిక్రూట్‌మెంట్స్‌ లేకపోవడంతో వయోపరిమితి దాటిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సురేశ్‌ తెలిపారు. యువతలో నిరాశలో కూరకుపోయిన యువతలో ఉత్సాహం నింపేందుకే తాను ఢిల్లీకి రన్నింగ్‌ చేసినట్టు సురేశ్‌ తెలిపారు.

ఆర్మీలో చేరాలన్న పట్టుదలతో ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్‌ మెహ్రా నిత్యం 10 కిలోమీటర్ల దూరంలోని మెక్‌డోనాల్డ్‌కు పరుగులు తీయడం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలో ప్రదీప్‌ మెహ్రా వీడియో తెగ వైరల్‌ అయింది. తాజాగా సురేష్‌ భించర్‌ పరుగు కూడా వైరల్‌ అవుతోంది. 350 కిలోమీటర్ల దూరం పరుగుపెట్టిన సురేశ్‌ పట్టుదలకు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరుగుల వీరుడంటూ కొనియాడుతున్నారు. 

Tags:    

Similar News