Women's Marriage Age: పార్లమెంటరీ కమిటీకి అమ్మాయిల వివాహ బిల్లు!
Women's Marriage Age: *నిర్ణయాత్మక చర్యన్న మంత్రి స్మృతి ఇరానీ *అమ్మాయిల పెళ్లి వయసు పెంపుపై ప్రతిపక్షాల ఆగ్రహం
Women's Marriage Age: అమ్మాయిల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ తెచ్చిన బిల్లును విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నివేదించింది. బాల్యవివాహాల నిషేధ బిల్లును సభలో ప్రవేశ పెట్టిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ.. విదేశీ పెళ్లిళ్ల చట్టం సహా ఏడు పర్సనల్ చట్టాలను సవరిస్తూ ఈ బిల్లు రూపొందించినట్లు తెలిపారు.
పెళ్లిళ్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అన్ని చట్టాలు, సంప్రదాయాలు, ఆచారాల స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది నిర్ణయాత్మక చర్యగా అభివర్ణించారు. అయితే ఇది ప్రాథమిక హక్కులను, వివిధ వ్యక్తిగత చట్టాలను ఉల్లంఘిస్తోందని, సంప్రదింపులు జరపకుండా హడావుడిగా తీసుకొచ్చారని విపక్షాలు ధ్వజమెత్తాయి.