Rail Tel IPO: రైల్వే స్టేషన్లలో ''మనీ కట్టు..ఇంటర్నెట్ పట్టు''
Rail Tel IPO: రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల సౌకర్యార్థము రైల్ టెల్ రుసుము ఆధారిత సేవలను ప్రారంభించింది.
RailTel IPO: రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల సౌకర్యార్థం ఇంటర్ నెట్ అందించడానికి రైల్ టెల్ రుసుము ఆధారిత సేవలను ప్రారంభించింది. ఒక్కరోజు పరిమితితో రూ.10కి 5జీబీ డేటాను అందిస్తామని రైల్‌టెల్ వెల్లడించింది. రూ.20కి 10 జీబీ ఇస్తూ 5 రోజుల కాలపరిమితి ఇచ్చింది. ఈ సేవలను దేశవ్యాప్తంగా 4000 రైల్వేస్టేషన్లలో అందుబాటులోకి తీసుకువచ్చామని రైల్‌టెల్ పేర్కొంది. ఇప్పటికే 5950 రైల్వేస్టేషన్లలో 1 ఎంబీపీఎస్ వేగంతో 30 నిమిషాల వరకు ప్రయాణికులకు ఉచిత వైఫై అందిస్తున్నామని తెలిపింది. అయితే ఇంటర్నెట్ వేగాన్ని 34 ఎంబీపీఎస్‌కు పెంచి పరిమిత రుసుముతో సేవలందిస్తామని ప్రకటించింది.
వందల కోట్ల రూపాయలను సేకరించాలని రైల్ టెల్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని మినీరత్న హోదా కలిగిన సంస్థ. ఇందులో నుంచి 25 శాతం మేర పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు 2018లో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రైల్ టెల్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఈ ఐపీఓలో భాగంగా స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా 8,71,53,369 ఈక్విటీ షేర్లను అమ్మకానికి ఉంచి రూ .819.24 కోట్ల వరకు సమకూర్చుకోవాలనే లక్ష్యంతో రైల్ టెల్ కార్పొరేషన్ ఉంది.