భారత్‌ జోడో యాత్రకు TPCC కసరత్తు.. రోజుకో లోక్‌సభ నియోజకవర్గ నేతలతో రాహుల్‌ భేటీ

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ కు సిద్ధం అయ్యారు.

Update: 2022-09-06 04:31 GMT

భారత్‌ జోడో యాత్రకు TPCC కసరత్తు.. రోజుకో లోక్‌సభ నియోజకవర్గ నేతలతో రాహుల్‌ భేటీ

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ 'భారత్‌ జోడో యాత్ర' కు సిద్ధం అయ్యారు. రేపు కన్యాకుమారిలో రాహుల్ యాత్ర ప్రారంభించనున్నారు. కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు 12 రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా యాత్ర కొనసాగనున్నది. రోజుకో లోక్‌సభ నియోజకవర్గ నేతలతో రాహుల్ భేటీ కానున్నారు. అక్టోబర్ 24న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనున్నది. దాదాపు 15 రోజుల పాటు తెలంగాణలో యాత్ర నిర్వహించనున్నారు.

రాష్ర్టంలో 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనాయకులు, అసెంబ్లీ ఇంచార్జీలు, డీసీసీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. పార్టీ బలోపేతం, రాష్ర్టంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై చర్చించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీతో కలిసి దేశ వ్యాప్తంగా నడిచే 118 మంది బృందంతో పాటు తెలంగాణలో వంద మంది నాయకులు పాదయాత్రలో కలిసి నడవనున్నారు. ఈ వంద మందిలో ఎవరెవరూ ఉండాలన్న దానిపై టీడీపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరెవరు యాత్రలో పాల్గొనాలనే దానిపై ముందుగానే నిర్ణయం తీసుకుని వారికి పాస్‌లు కూడా జారీ చేసే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News