Amit Shah: రాహుల్ గాంధీకి 40 సీట్లు సైతం రావు
Amit Shah: మోడీ మూడోసారి ప్రధాని కానున్నారు
Amit Shah: కాంగ్రెస్ కు 40 ఎంపీ సీట్లు కూడా దక్కవని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ సంత్ కబిర్ నగర్ లో గురువారంనాడు నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. ఇప్పటివరకు జరిగిన ఐదు విడతల్లో బీజేపీ 310 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందన్నారు. త్వరలో జరిగే రెండు విడతల్లో 400 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇండియా కూటమిలోని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేవన్నారు. మీకు ఎక్కడైనా రాహుల్ గాంధీ కన్పిస్తే మీకు 40 సీట్లు కూడా దక్కవని చెప్పండి... అంతేకాదు అఖిలేష్ యాదవ్ కు 4 సీట్లు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు.
ఇవాళ ఉదయం దోమరియాగంజ్ లో నిర్వహించిన సభలో కూడా ఇండియా కూటమిపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి మెజారిటీ ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరని ఆయన ప్రశ్నించారు. శరద్ పవార్, లాలూ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీలలో ఎవరుప్రధానమంత్రి అవుతారని ఆయన ప్రశ్నించారు.
#WATCH | In his public meeting in Uttar Pradesh's Sant Kabir Nagar, Union HM Amit Shah says, "In 5 phases, PM Modi has crossed the 310 mark and moving towards 400. If you see Rahul Baba somewhere, tell him that he is not getting more than 40 seats, Akhilesh Yadav won't cross the… pic.twitter.com/ICC6FkJg66
— ANI (@ANI) May 23, 2024