Corona Vaccination: నేషనల్ పాలిటిక్స్‌లో ట్వీట్ల యుద్ధం
Corona Vaccination: కేంద్ర రాజకీయాల్లో ట్వీట్ల యుద్ధం హాట్‌టాపిక్‌గా మారింది.
Corona Vaccination: కేంద్ర రాజకీయాల్లో ట్వీట్ల యుద్ధం హాట్‌టాపిక్‌గా మారింది. దేశంలో వ్యాక్సినేషన్ అంశం కేంద్రం వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయింది. వ్యాక్సినేషన్‌లో జులై టార్గెట్ అంశంలో కేంద్ర ప్రభుత్వ విఫలమైందని రాహుల్ కామెంట్లపై బీజేపీ మంత్రులు కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా స్పదించిన పియూష్ గోయల్, హర్షవర్ధన్‌లు రాహుల్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.
రాహుల్ కామెంట్లపై కౌంటరిచ్చిన పియూష్ గోయల్ జులై నాటికి 12కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. డోసుల సరఫరా గురించి 15 రోజుల ముందుగానే రాష్ట్రాలన్నింటికీ సమాచారం అందించామన్నారు. క్లిష్ట సమయంలో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలంటూ ఫైర్ అయ్యారు. కరోనా పోరాటంపై దృష్టిపెట్టడమే సముచితం అన్న పియూష్ ఈ విషయాన్ని రాహుల్ అర్థం చేసుకుంటే మంచిదంటూ కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు రాహుల్ కామెంట్స్‌పై కేంద్ర మంత్రి హర్షవర్థన్ సెటైర్లు వేశారు. జులైలో వ్యాక్సినేషన్‌పై గురువారమే క్లారిటీ ఇచ్చాం అసలు రాహుల్ సమస్యేంటి.? ఆయన చదవలేదా లేక అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. అంతేనా కోవిడ్‌కు వ్యాక్సిన్ ఉంది కానీ అహంకారం, అజ్ఞానం అనే వైరస్‌కు టీకా లేదంటూ హర్షవర్ధన్ విరుచుకుపడ్డారు.