ట్విట్టర్‌పై రాహల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. తన ఫాలోవర్స్‌ను..

Rahul Gandhi: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ కావాలనే ఫాలోవర్ల సంఖ్యను తగ్గిస్తుందా?

Update: 2022-01-27 10:44 GMT

ట్విట్టర్‌పై రాహల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. తన ఫాలోవర్స్‌ను..

Rahul Gandhi: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ కావాలనే ఫాలోవర్ల సంఖ్యను తగ్గిస్తుందా? విపక్ష నేతల ట్విట్టర్ ఖాతాలపై కేంద్రం పరిశీలిస్తోందా? విపక్ష నేతల ఫాలోవర్స్‌ను తగ్గించమని మైక్రో బ్లాగింగ్‌ సంస్థను కేంద్రం ఒత్తిడి చేస్తోందా? కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ ఫాలోవర్స్‌ను అందుకే తగ్గించిందా?

ఇటీవల కాలంలో డిజిటల్‌ మీడియా ప్రాధాన్యం పెరిగిపోయింది. ప్రత్యేకించి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సామాజిక మాధ్యమాలు కీలకంగా మారాయి. ప్రధాన మీడియా సంస్థలు ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తుండడంతో విపక్షాలకు సోషల్‌ మీడియా వేదికగా మారింది. ప్రభుత్వ విధానాలను విపక్ష నేతలు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పలు అంశాలపై సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో తన పాలోవర్లను పరిమితం చేసిదంటూ ట్విట్టర్‌పై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపనణలు చేశారు. ఆగస్టు 2021లో తన ట్విట్టర్‌ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసినప్పటి నుంచి వాస్తవంగా ఫాలోవర్లను స్తంభింపజేసిందని ఆరోపించారు. ఆమేరకు ట్విట్టర్‌ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు డిసెంబరు 27న రాహుల్‌ లేఖ రాశారు. కొన్ని నెలలుగా తన కొత్త ఫాలోవర్ల సంఖ్య భారీగా పడిపోయిందని ఫిర్యాదు చేశారు.

నెలకు 2 లక్షల 30 వేల మందికిపైగా తన ఖాతాను కొత్తగా ఫాలో అవుతున్నరాని రాహుల్‌ తెలిపారు. కొన్ని నెలల్లో ఇది 6 లక్షల 50 వేలుగా ఉందన్నారు. కానీ, 2021 ఆగస్టు నుంచి నెలకు 2వేల 500 మంది కొత్త ఫాలోవర్లు తగ్గుతున్నారని వివరించారు. ఈ మధ్య తన ఫాలోవర్లు 19.5 మిలియన్ల మంది వాస్తవంగా స్తంభించిపోయినట్టు చెప్పారు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉన్నట్టు రాహుల్‌ ఆరోపించారు. బీజేపీ నాయకులు పోస్టులను తొలగించకుండా ట్విట్టర్‌ కాంగ్రెస్‌ నాయకులనే టార్గెట్‌ చేసినట్టు విమర్శించారు.

అయితే దీనిపై ట్విట్టర్‌ స్పందించింది. తాము ఎవరి ఒత్తిడికి తలొగ్గడం లేదని స్పష్టం చేసింది. విద్వేషపూర్తిత, ట్విట్టర్‌ నిబంధనలను ఉల్లంఘించే లక్షల ఖాతాలను తొలగిస్తామని.. ఈ క్రమంలో రాహుల్ ఫాలోవర్ల సంఖ్య తగ్గి ఉండవచ్చని వివరించింది. ఢిల్లీలో రైతు ఉద్యమ సమయంలో ట్విట్టర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ నడిచింది. ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు కూడా జారీ చేసింది.



Tags:    

Similar News