హత్రాస్ పర్యటన : రాహుల్, ప్రియాంకా లకు అనుమతి

Hathras Victim's Family : హత్రాస్ పర్యటనకు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు పోలిసులు అనుమతి ఇచ్చారు. వీరితో పాటుగా మరో అయిదుగురికి అనుమతినిచ్చారు పోలీసులు.. దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు

Update: 2020-10-03 11:43 GMT

Rahul Gandhi, Priyanka Vadra

Hathras Victim's Family : హత్రాస్ పర్యటనకు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు పోలిసులు అనుమతి ఇచ్చారు. వీరితో పాటుగా మరో అయిదుగురికి అనుమతినిచ్చారు పోలీసులు.. దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు నోయిడా పోలీసులు.. హత్రాస్ లోని అత్యాచార భాదితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కూడిన కాంగ్రెస్ బృందం ఈరోజు యూపీకి బయలుదేరింది. కాగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో హత్రాస్ లో 144 సెక్షన్ ని విధించారు పోలీసులు..

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల షెడ్యూల్ పర్యటనకు ముందు ఉత్తర ప్రదేశ్ సరిహద్దు వద్ద భారీ సంఖ్యలో పోలీసులను నియమించారు. గౌతమ్ బుద్ధ నగర్‌లో సిఆర్‌పిసి సెక్షన్ 144 విధించినప్పటికీ, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఢిల్లీ నోయిడా డైరెక్ట్ (డిఎన్‌డి) ఫ్లైవే వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. భాదితురాలు కుటుంబానికి కలవడానికి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలది ఇది రెండో ప్రయత్నం కాగా, మొదటి ప్రయత్నంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రాహుల్‌ గాంధీని నెట్టడంతో ఆయన కింద పడ్డారు. యూపీ పోలీసులు వారిని తిరిగి ఢిల్లీకి తీసుకెళ్లారు.

ఇదిలావుండగా, కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ రోజు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు.. వారి హత్రాస్ సందర్శన వారి రాజకీయాల కోసమేనని, బాధితుడికి న్యాయం కోసం కాదని ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు "అని స్మృతి ఇరానీ విలేకరులతో అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ వ్యూహాల గురించి ప్రజలకు తెలుసునని, అందుకే ప్రజలు 2019 ఎన్నికలలో బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని కల్పించారని ఆమె అన్నారు.

Tags:    

Similar News