Kerala :సముద్రంలోకి దూకి ఈత కొట్టిన రాహుల్ గాంధీ

Kerala: మత్స్య కారులతో పడవలో ప్రయాణిస్తూ హఠాత్తుగా సముద్రంలోకి దూకి ఈత కొట్టిన రాహుల్ గాంధీ

Update: 2021-02-25 02:39 GMT

ఫైల్ ఇమేజ్ 

Kerala: ఐదు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒకటి కేరళ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అతి పెద్ద సాహసమే చేశారు. కొల్లాం సముద్రంలో మత్స్య కారులతో కలసి చేపలు పట్టే ప్రయత్నం చేశారు. మధ్యలో హఠాత్తుగా పడవలో నుంచి సముద్రంలో దూకి జాలర్లతో కలిసి ఈతకొట్టారు. దాదాపు గంటసేపు సముద్రంలో కలిసి ఈదులాడిన అనంతరం.. ''ఇన్నాళ్లకు నా కల తీరింది'' అని రాహుల్ అన్నారట. ఈ స్విమ్మింగ్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తిరిగి ఒడ్డుకు వచ్చాక థంగస్సెరీ బీచ్‌ దగ్గర మత్స్యకారులనుద్దేశించి రాహుల్‌ మాట్లాడారు. కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం చేపలు పట్టడానికి సముద్రంలో ట్రాలర్లు ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చు కోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. ఈ ఒప్పందం వల్ల జాలర్లు జీవనోపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ''మీరు చేసే పనిని నేను ఎంతో గౌర విస్తాను. ఆరాధిస్తాను. మేము లొట్టలేసుకుంటూ చేపలు తింటూ ఉంటాం. కానీ అవి మా ప్లేట్‌లోకి రావడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు ఇవాళే అర్థమైంది'' అని రాహుల్‌ అన్నారు.

Tags:    

Similar News