లోక్ సభలో నీట్ పేపర్ లీకేజీపై విపక్షాల నిరసన
లోక్ సభలో నీట్ పేపర్ లీకేజీపై విపక్షాల నిరసన
నీట్ రగడ పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది. నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలపై విపక్ష నేతలు, అధికార పార్టీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. నీట్‌పై లోక్‌సభలో చర్చ ప్రారంభించగా.. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందంటూ విపక్షాలు ప్రశ్నలు సంధించాయి. దాంతో పేపర్ లీక్ అయినట్టు ఎక్కడా ఆధారాలు లేవని.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన 240 పరీక్షల్లో ఎక్కడా అక్రమాలు వెలుగుచూడలేదన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రదాన్.
నీట్ వివాదంపై లోక్‌సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. పేపర్ లీక్ దేశవ్యాప్తంగా యువతకు తీవ్ర సమస్యగా మారిందన్నారు. దేశంలో పరీక్షల నిర్వహణ గాడి తప్పిందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రికి నీట్ విషయంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారన్న రాహుల్.. టెస్టింగ్ సిస్టమ్‌లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్.. ప్రతిపక్ష నేత దేశంలో ఎగ్జామినేషన్ సిస్టమ్‌ను నిందించడం కరెక్ట్ కాదన్నారు. మాల్ ప్రాక్టీస్ కోసం 2010లో యూపీఏ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి, ప్రైవేట్ విద్యాసంస్థలకు భయపడి ఉపసంహరించుకుందని.. అలాంటి కాంగ్రెస్ ఇవాళ నీట్‌పై ప్రశ్నిస్తుందంటూ మండిపడ్డారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవన్నారు.