Rahul Gandhi: టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సరైందేనా.?- రాహుల్
Rahul Gandhi: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోన్న వేళ దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్ టీకాలను ఎగుమతి చేయడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Rahul Gandhi: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోన్న వేళ దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్ టీకాలను ఎగుమతి చేయడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఓ వైపు వ్యాక్సిన్ల కొరత ఉందని రాష్ట్రాలు చెబుతుంటే ప్రధాని మోడీ మాత్రం టీకా ఉత్సవం జరపాలంటున్నారని ధ్వజమెత్తారు.
కరోనా కేసులు పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల కొరత అనేది చాలా తీవ్రమైన సమస్య అని అంతేగానీ ఉత్సవం కాదన్నారు. దేశ ప్రజలను ప్రమాదంలో ఉంచి టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సరైందేనా? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం చూపించకుండా అన్ని రాష్ట్రాలకు సత్వర సాయం అందించాలన్నారు. ఈ మహమ్మారిపై మనమంతా కలిసికట్టుగా పోరాడి కరోనాను ఓడించాలని రాహుల్ పేర్కొన్నారు.